తూలి పడబోయిన సిఎం రోశయ్య

ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం ఉదయమే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి అడుగు పెట్టారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల తర్వాత ఆయన అందుకు ఉపక్రమించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చాలా కాలం ఆయన కుమారుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొన్ని విమర్శలు రావడంతో ఆయన తన మకాం మార్చారు. దీంతో రోశయ్య ముఖ్యమంత్రి కార్యాలయంలోకి అడుగు పెట్టడానికి అవకాశం చిక్కింది.












Click it and Unblock the Notifications