17 జిల్లాలతో తెలంగాణ: నారగోని

ఉద్యమ తీరుతెన్నులపై నారగోని మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. టీడీపీ గత ఎన్నికల సందర్భంలో తెలంగాణ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మాట మార్చిన వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. జేఏసీ కన్వీనర్ కోదండరామ్ టీఆర్‌ఎస్ జేబు సంస్థగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల విజయం కోసమే ఆయన పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్యమాన్ని నిర్వీర్యపరిచారని వాపోయారు. ముఖ్యమంత్రి రోశయ్య ఆంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయనను మార్చాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా హైదరాబాద్ ఫ్రీజోన్ కాకుండా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications