కర్నూలు: కర్నూలు జిల్లాలో ఓ కీచక టీచర్ ఉదంతం చోటు చేసుకుంది. తన వద్దకు సందేహాలు తీర్చుకోవడానికి వచ్చిన పదో తరగతి బాలికపై నారాయణ అనే ఉపాధ్యాయుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది. మంగళవారం పరీక్షకు హాజరు కావడానికి ముందు కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి బాలిక టీచర్ ఇంటికి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వెళ్లింది.
తన వద్దకు వచ్చిన బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వైపిపిఎం పాఠశాలకు చెందిన నారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు.