మెదక్: తన ఇమేజ్ తగ్గిపోతుందని భయపడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలుచుకునేందుకు ఎన్టీఆర్ ఫొటోలను మళ్లీ తీసుకు వస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు వ్యాఖ్యానించారు. కోట్లలో ఖనిజ సంపదను కొల్లగొట్టడం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలను శాసించే స్థాయికి గాలి సోదరులు చేరుకున్నారని ఆయన అన్నారు.
అక్రమంగా ఖనిజ సంపదను కొల్లగొడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నిర్ణీత గడువు లోపలే తన నివేదిక సమర్పిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.