8 వేల పౌండ్లు పలికిన హిట్లర్ లేఖ

Adolf Hitler
లండన్: తన నియంతృత్వ ధోరణితో ప్రపంచాన్ని గడగడలాడించిన అడాల్ఫ్ హిట్లర్ రాసిన లేఖ ఒక్కటి 8 వేల పౌండ్లు పలికింది. బ్రిటన్, జర్మనీల మధ్య సామరస్య సంబంధాలను కాంక్షిస్తూ ఆయన రాసిన లేఖను వేలం వేశారు. ఆ ఒక్క పేజీ లేఖను హిట్లర్ 1931 సెప్టెంబర్ 30వ తేదీన రాశాడు. బ్రిటన్ ఎదుర్కుంటున్న ఆర్థిక సంక్షోభంపై వార్తాకథనం రాసేందుకు బ్రిటిష్ జర్నలిస్టు సెఫ్టన్ డెల్మర్ ఆహ్వానానికి స్పందిస్తూ హిట్లర్ ఆ లేఖ రాశారు.

ప్రథమ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన సెటిల్ మెంట్ తొలగింపునకు బ్రిటన్, జర్మనీల మధ్య ఒప్పందం కుదరగలదని హిట్లర్ ఆ లేఖలో ఆశించారు. మాసాచుసెట్స్ కు చెందిన రెండో ప్రపంచ యుద్ధం మ్యూజియలం యజమాని కెన్నెత్ రెండెల్ ఈ లేఖను కొనుగోలు చేశాడు. చారిత్రక ప్రాధాన్యం గల ఆ లేఖకు తాను 50 వేల పౌండ్లైనా చెల్లించే వాడినని అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+