వైయస్ ఫ్యామిలీ దోచుకుంటోంది: నారాయణ

కర్నూలు జిల్లాలోని అవుకు భూములు, మైనింగ్ భూముల అన్యాక్రాంతంపై విచారణకు కమిటీ వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనింగ్ అక్రమాలను చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల భూములు వారికే తెలియకుండా అన్యాక్రాంతమవుతున్నాయని ఆయన అన్నారు. కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై తాము ఎన్నో ఆందోళనలు చేశామని, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications