ప్రభుత్వానికి కాగ్ నివేదిక అక్షింతలు

ఉపాధి హామీ పథకానికి సంబంధించి 38 కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించినట్లు కాగ్ అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్టుల నాణ్యత, నియంత్రం సరిగా లేదని, అనుభవం లేనివారికి కాంట్రాక్టులు అప్పగించారని విమర్శించింది. జలయజ్ఞం కింది సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణకు అధిక మొత్తం చెల్లింపులు జరిపారని తప్పు పట్టింది. ఐటి కంపెనీలకు 165 కోట్ల రూపాయలకు 50 ఎకరాల భూములను అప్పగించడాన్ని కూడా కాగ్ తప్పు పట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పని తీరును కూడా కాగ్ తప్పు పట్టింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్థిక యాజమాన్యం లోపభూయిష్టంగా ఉందని అభిప్రాయపడింది. నియామకాల విధానాన్ని కూడా తప్పు పట్టింది.












Click it and Unblock the Notifications