గుంటూరు: చీటీల పేరుతో ప్రజలకు కోటి రూపాయల మేరకు టోపీ పెట్టిన సంఘటన గుంటూరు జిల్లా కారంపూడిలో జరిగింది. వీర నారాయణాచారి అనే ఏజెంటు ప్రజల నుంచి చీటీల పేరుతో కోటి రూపాయల మేరకు వసూలు చేసి ఉడాయించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులంతా పేదలు, కూలీలే. అవసరాల కోసం డబ్బు అంది వస్తుందనే ఉద్దేశంతో వీర నారాయణాచారి చెప్పిన మాటలకు మోసపోయారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీర నారాయణాచారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డబ్బు పోవడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.