నేదురుమల్లిపై సిఎంకు సోదరుడి ఫిర్యాదు

తాను నేదరుమల్లి ఇంటి ముందు ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన అన్నారు. నేదురుమల్లిపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పని చేశారని ఆయన విమర్శించారు. పనబాక కృష్ణయ్యను పని కట్టుకుని ఓడించారని ఆయన ఆరోపించారు. నేదురుమల్లి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల నెల్లూరు జిల్లాలో మూడు స్థానాల్లో కాంగ్రెసు అభ్యర్థులు ఓడిపోయారని ఆయన అన్నారు. నేదరుమల్లి కాంగ్రెసుకు ద్రోహం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications