కుట్ర గురించి ఆలోచించాల్సిందే: జెసి

JC Diwakar Reddy
న్యూఢిల్లీ: హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల వెనక కుట్ర ఉందనే ప్రకటనల గురించి ఆలోచించాల్సిందేనని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తనకైతే తెలియదని, తాను హైదరాబాద్ కొత్త నగరంలో ఉంటానని, అల్లర్లు పాతబస్తీలో జరిగాయని, అయితే ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గాన్ని విస్తరించకూడదని భావిస్తున్నవాళ్లు పార్టీలో ఉన్నారని, వారు కుట్ర చేస్తే చేసి ఉండవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తో కలిసి ఆయన మంగళవారం సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను కలుసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో రోశయ్య దూతగా ఆయన ఢిల్లీ వచ్చినట్లు సమాచారం. అహ్మద్ పటేల్ ను కలిసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల వెనక సీమాంధ్ర నాయకుల కుట్ర ఉందనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విమర్సను ఆయన కొట్టి పారేశారు. సీమాంధ్ర నాయకులకు అంత సత్తా లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులకు అంత సత్తా ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని ఆయన అన్నారు. సంచలనం సృష్టించే సత్తా తెలంగాణవాదులకే ఉందని ఆయన అన్నారు. జెసి న్యూఢిల్లీ రావడాన్ని బట్టి ఏప్రిల్ మొదటివారంలో రోశయ్య మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+