అల్లర్లను ఉక్కుపాదంతో అణచేస్తాం: సిఎం

మంగళవారం శాసనసభ సమావేశాలు ప్రారంభ కాగానే తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు పాతబస్తీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టాయి. అల్లర్ల వెనక రాజకీయ కుట్ర ఉందని అంటున్నారని, దాన్ని బహిర్గతం చేయాలని తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో హైదరాబాదుకు చెందిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ కల్పించుకుని - సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయవద్దని, పరిస్థితిని అదుపులోకి తేవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పరిస్థితిపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. సబా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications