పూణే: మహారాష్ట్రలోని పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి చెందారు. పూణే - సతారా జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం సతారా నుంచి పూణేకు వెళ్తుండగా దాని టైర్ ఒక్కటి పగిలిపోయింది. దాంతో వాహనం బోల్తా పడింది.
రోడ్డు ప్రమాదం సోమవారం తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడినవారిని సాసూన్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.