నక్సల్స్ దాడి: 73 మంది జవాన్ల మృతి

Maoists
రాయపూర్: ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి దిగారు. ఆరు చోట్ల నక్సలైట్లు మెరుపు దాడులకు దిగారు. ఓ సిఆర్పీఎఫ్ వాహనాన్ని మందుపాతరతో మావోయిస్టులు పేల్చేశారు. ఈ ఘటనలో 73 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఓ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. దంతెవాడ జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. యాంటీ మైన్ వెహికిల్ ను నక్సలైట్లు పేల్చేశారు. దాదాపు 500 మంది జవాన్లు వెనక్కి వస్తుండగా పథకం ప్రకారం మావోయిస్టులు దాడులు చేశారు. సంఘటనా స్థలం నుంచి 73 మృతదేహాలను తరలించారు.

ఘటన జరిగిన ప్రదేశంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దాదాపు వేయి మంది నక్సలైట్లు ఈ చర్యకు దిగినట్లు సమాచారం. గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ చర్యకు పూనుకున్నట్లు సమాచారం. మృతదేహాలను తరలించడానికి హెలికాప్టర్ ను వాడుతున్నట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ విశ్వరంజన్ చెప్పారు. సంఘటన జరిగిన ప్రదేశం ఆంధ్ర సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. గాయపడిన జవాన్లలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల చేతిలో కొంత మంది జవాన్లు బందీలుగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 200 మంది దాకా మావోయిస్టుల చేతిలో బందీగా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

సంఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. ఉన్నతాధికారులు కూడా ఆ ప్రాంతానికి బయలుదేరారు. ప్రాణ నష్టం భారీగా జరిగిందని, తాను దిగ్భ్రాంతి చెందానని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయం అందిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+