దంతేవాడు నరమేథం: సూత్రధారి ఎవరు?

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కటికం సుదర్శన్ అలియాస్ ఆనంద్, అలియాస్ మోహన్ అలియాస్ ఎఎన్ అలియాస్ బీరేంద్రజీ సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు. 53 ఏళ్ల అతన్ని హింసకు పురిగొల్పే వ్యక్తి కన్నా బోధకుడిగానే ఎక్కువగా చూస్తారని అంటారు. గత 30 ఏళ్లుగా నక్సలైట్ ఉద్యమంలో ఉన్న ఇతనికి వ్యూహకర్తగా పేరుంది. అతను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని చేనేత కుటుంబానికి చెందినవాడు. వరంగల్ లో పాలిటెక్నిక్ చదువుతూ నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లాడు.
సుదర్శన్ మావోయిస్టు కేంద్ర కమిటీలో శక్తివంతమైన నాయకుడు. కేంద్ర ప్రాంతీయ బ్యూరోకు అధిపతి అని చెప్తారు. దీని పరిధిలోకి ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు, ఉత్తర తెలంగాణ జోన్లు, దండకారణ్య ప్రాంత (చత్తీస్ గడ్) వస్తాయి. సుదర్శన్ వ్యూహం రచించి ఆమోదం తెలుపుతాడని, ఎప్పుడు కూడా దాడిలో పాల్గొనడని విశ్లేషకులు చెప్తారు. దంతేవాడ దాడి వెనక కూడా పని చేసింది ఆయనేనని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications