జగన్ యాత్రకు భారీగా జనసమీకరణ

YS Jagan
గన్నవరం: ఈ నెల 9వ తేదీన కృష్ణాజిల్లాలో పర్యటించనున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి "ఓదార్పు" పర్యటనను విజయవంతం చేసేందుకు భారీగా జనసమీకరణ జరుగుతోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి జనాన్ని వెల్లువలా తరలించి జగన్‌కు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ రూరల్‌, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లోని ప్రతి గ్రామం నుంచి జనాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమాన్ని తమ భుజానికెత్తుకుని పనిచేస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి జనం వచ్చేందుకు ట్రాక్టర్లు, కార్లు ఏర్పాటు చేస్తున్నారు. విమానం దిగిన తర్వాత ఎయిర్‌పోర్టు వద్ద అపూర్వ స్వాగతం పలికేందుకు కసరత్తు చేస్తున్నారు. ముద్దరబోయిన ఇప్పటికే జగన్‌ వస్తున్నట్లు అన్ని గ్రామాలకు సమాచారం పంపారు.

గ్రామస్థాయి నాయకుల వరకూ సమాచారం చేరడంతో గ్రామాల్లోనూ కదలిక వచ్చింది. జగన్‌ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్‌, పెడన ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌, యువజన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు తలశిల రఘురాం జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ తాము కూడా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+