ఇన్ఫోసిస్ ఉద్యోగిని లక్ష్మి అదృశ్యం

ఆయన భార్య లక్ష్మీప్రియ (35) ఇన్ఫోసిస్ కం పెనీలో క్వాలిటీ కంట్రోల్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తోంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ప్రతిరోజు లక్ష్మీప్రియ ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చి కార్ఖాన పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో బస్సు ఎక్కేది. సోమవారం ఎప్పటిలానే బస్టాప్‌కు వచ్చింది. అయితే బస్సు వెళ్లిపోవటంతో అక్కడే ఉన్న ఆటో ఎక్కింది. బస్సును ఛేజ్ చేయాలని చెప్పింది.
బస్సు జూబ్లీ బ స్టాండు నుంచి నేరుగా ప్యాట్నీ వైపు వెళ్లిపోగా, ఆటోడ్రైవర్ జూబ్లీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డులోకి ఆటోను మళ్లించాడు. అప్పటికే ఆటోలో ఇంకో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. ఆటోలో ఉన్న లక్ష్మీప్రియ తన చేతిలో ఉన్న సెల్‌ఫోన్ కలిగి ఉన్న పర్సును రోడ్డుపైకి విసిరింది. ఆ సమయంలో అటుగా కూకట్‌పల్లి స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెళుతున్నారు. వారికి ఆ పర్సు దొరికింది.
కానిస్టేబుళ్లతోపాటు జూబ్లీ బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లు లక్ష్మీప్రియ పర్సును విసిరేయటం చూశా రు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు బ్యాగు తెరిచి చూడగా సెల్‌ఫోన్ కనిపించింది. కాంటాక్ట్ లిస్టులో హోం అన్న నెంబర్‌కు డయల్ చేయగా లక్ష్మీప్రియ భర్త లక్ష్మణ్ వారితో మాట్లాడాడు. లక్ష్మణ్‌కు కానిస్టేబుళ్లు జరిగిన విషయం చెప్పి తాము కూకట్‌పల్లి స్టేషన్‌కు వెళుతున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications