వెనకబాటుపై రాష్ట్ర విభజన తగదు: కేశవ్

మూడు వేల ఏళ్ల పాటు తెలుగు జాతి కలిసి ఉన్న విషయాన్ని చారిత్రక ఆధారాలతో నివేదిక స్పష్టం చేస్తుందని ఆయన అన్నారు. 1956లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి, ఇప్పటి పరిస్థితి ఏమిటి అనే విషయాలను తాము నివేదికలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ అసమానతలు ఎలా ఉన్నాయనే విషయం కూడా చెప్పామని ఆయన అన్నారు. ఒక ప్రాంతంలో ఏయే ప్రాంతాలు వెనకబడి ఉన్నాయో చెప్పామని ఆయన అన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను ప్రాంతాలవారీగా తెలియజేసినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications