బందరు పోర్టు పనులు మేలో మొదలు

పోర్టు పనులను దక్కించుకున్న మేటాస్ సంస్థ ఆర్థికపరమైన చిక్కుల్లో పడటంతో ఈ పనులను అన్ని జాగ్రత్తలూ తీసుకుని నవయుగ కన్సార్టియానికి అప్పగించినట్లు చెప్పారు. ఈ సంస్థ కృష్ణపట్నం పోర్టు నిర్మాణాన్ని 17 నెలల్లోనే పూర్తి చేసిందన్నారు. బందరు పోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలని ఒప్పందం జరిగినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.350 కోట్లు మూడు విడతలుగా అందిస్తామన్నారు. పోర్టుకు కేటాయించిన ఆరువేల ఎకరాల భూమి అప్పగించే విషయంపై ఇప్పటికే కలెక్టర్‌తో మాట్లాడానన్నారు. సాధ్యమైనంత త్వరలో భూమిని అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications