కుంటిసాకులతో ఉద్యమాలు వద్దు: సిఎం

Rosaiah
రాజమండ్రి: ఉద్యమాలతో రాష్ట్రం క్లిష్ట పరిస్థితి ఎదుర్కోంటోందని ముఖ్యమంత్రి రోశయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించిందని, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉందామని ఆయన ప్రజలకు విన్నవించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోశయ్య మాట్లాడారు. కుంటి సాకులతో ఉద్యమాలు చేస్తున్నారని, వీటివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ఆర్థికం గా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ పరిస్థితులలో రాష్ట్రాభివృద్ధికి ప్రజలంతా కలసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఇప్పటికే ప్రధానమంత్రితో పలుమార్లు మాట్లాడానని చెప్పారు. ఈనెల 14,15 తేదీలలో ఢిల్లీ వెళ్లినప్పుడు దీనిపై మరోమారు ప్రధానితో మాట్లాడతానని, ఆయనను ఒప్పించేందుకు విశ్వప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.

రాజకీయాలలో ఎవరికైనా సీఎం కావాలన్న ఆశ ఉంటుందని, ఆ పదవి వస్తే ఎవరికైనా ఆనందమేనని, కానీ రాష్ట్రం మొత్తం విషాదంలో ఉన్నపుడు రోశయ్యకు సీఎం పదవి అప్పజెప్పారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ అంశాన్ని రోశయ్య ప్రస్తావిస్తూ - తాను సీఎం కావాలని ఎప్పుడూ కోరుకోలేదని, ఈ పదవిని సంతోషంగా స్వీకరించలేదని అధిష్ఠానం తనకు అప్పగించిన పదవిని గురుతర బాధ్యతగానే ఇప్పటికీ భావిస్తున్నానని అన్నారు. వైయస్ అకాల మరణం కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలతోపాటు తనకూ హృదయ వేదన కలిగిస్తోందన్నారు. రోశయ్య ప్రసంగిస్తుండగా కొంతమంది డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కావాలనే సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సబ బు కాదని రోశయ్య హితవు పలికారు. ఏదైనా ఉంటే తన వద్దకు వస్తే మాట్లాడుతానని సూచించారు. ఈ సభలో రోశయ్యను జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వర్ణ కిరీటంతో సన్మానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+