కెసిఆర్ కు వికె దుగ్గల్ ఆహ్వానం

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: సంప్రదింపుల కోసం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును ఆహ్వానించారు. ఈ మేరకు దుగ్గల్ కెసిఆర్ కు సోమవారం ఓ లేఖ రాశారు. దాంతో కెసిఆర్ ఈ నెల 13వ తేదీన ఢిల్లీ వస్తున్నారు. ఆయన ఈ నెల 16వ తేదీన శ్రీకృష్ణ కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. ఆయన ఉదయం 11 గంటలకు వారితో సమావేశమవుతారు. సంప్రదింపులు రెండు గంటల పాటు సాగుతాయి.

రాష్ట్ర పరిస్థితిపై ఏర్పడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ నెల 16వ తేదీ నుంచి రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుంది. ఇందులో భాగంగా తొలుత తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ను చర్చలకు ఆహ్వానించారు. వరుసగా ఇతర రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతారు. కాగా, ఈ నెల 22, 23 తేదీల్లో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు హైదరాబాద్ వెళ్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+