తెలుగుదేశంలోకి మళ్ళీ జయప్రద

మళ్లీ పార్టీలోకి రావడానికి జయప్రద సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీలో తనకు లభించే ప్రాధాన్యంపై సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే సముచిత ప్రాధాన్యమే లభిస్తుందని రాయబారం జరుపుతున్న నేతలు ఆమెకు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే, తనతోపాటు బహిష్కరణకు గురైన అమర్‌సింగ్‌తో కూడా చర్చించి త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియజేస్తానని జయప్రద చెప్పినట్టు తెలిసింది. రోజా పార్టీ నుంచి పార్టీ నుంచి వెళ్లిపోవడంతో జయప్రద తిరిగి పార్టీలో చేరితే ఆమెకు తెలుగు మహిళ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications