రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ముఖ్యమంత్రి కె. రోశయ్య కార్యక్రమంపై సోమవారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదం నుంచి రోశయ్య తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకోవడానికి రావాల్సి ఉంది. ఆయన రావడానికి కొద్దిసేపు ముందు తేనెటీగలు లేచాయి. దీంతో వాటిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. అయితే ముఖ్యమంత్రి వచ్చేసరికి తేనెటీగలు వెళ్లిపోయాయి. దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, రోశయ్య గత రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. సోమవారం తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు.