హైదరాబాద్: వైయస్ జగన్ ఓదార్పుయాత్రను అడ్డుకుంటామని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) స్పష్టం హెచ్చరించింది..ఈ మేరకు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ తెలంగాణలో అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమానికి జగన్ మద్దతు తెలిపితే రెడ్ కార్పెట్లతో స్వాగతం పలుకుతామని శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ విద్యార్థుల బలిదానాలపై ఏనాడూ నోరుమెదపని జగన్, 8 నెలల క్రితం చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం ప్రాంతీయతత్వం, వైషమ్యాలను రెచ్చగొట్టడమేనన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న వైయస్ జగన్ ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మంలో జగన్ ఓదార్పు యాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.