కడప: కడప జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కడప జిల్లా మైదుకూరు మండలం వరదాయపాలెం గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆటో నుజ్జు నుజ్జు అయింది. సంఘటనా స్థలం బీభత్సంగా ఉంది. లారీ డ్రైవర్, క్లీనర్ పరారీ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.