ఢిల్లీ యాత్ర ఎంతో సంతోషంగా ఉంది: సిఎం

శాసనసభ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగడం పట్ల తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను అభినందించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ అల్లర్ల విషయంలో తాము తీసుకున్న చర్యలను, రాజకీయ పార్టీలు సహకరించిన తీరును సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో కూడా సోనియా అభినందించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 15 జాతీయ రహదారులకు చెందిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి కమల్నాథ్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆయన తెలిపారు. సోనియా, మన్మోహన్ ల సహకారంతోనే రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు సహాయం అందుతోందని ఆయన అన్నారు. రాష్టానికి 15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్రం అనుమతించిందని ఆయన చెప్పారు.
హైదరాబాదులోని రెండు, రంగారెడ్డిలోని ఒక ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలపై కూడా పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. మజ్లీస్ తో ఉన్న ఒప్పందం మేరకు హైదరాబాదులో ఒక స్థానాన్ని ఆ పార్టీకి ఇస్తామని, మిగతా రెండు స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఈ రెండు స్థానాలకు కూడా సాయంత్రంలోగా అభ్యర్థులు ఖరారవుతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications