థరూర్ కు ఉద్వాసన పలికే అవకాశం

కాగా, శశి థరూర్ కు ఉద్వాసన పలికే దిశగా కూడా కాంగ్రెసు నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తిరిగి రాగానే థరూర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. థరూర్ కు దూరంగానే ఉండాలని కాంగ్రెసు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు కూడా థరూర్ వివరణను పట్టించుకోవడం లేదు. థరూర్ రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభలను శుక్రవారం సాగనివ్వలేదు. థరూర్ మాత్రం తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని అంటున్నారు. తన మిత్రురాలు సునంద పుష్కర్ కు కొచ్చి ఫ్రాంచైజీలో 70 కోట్ల రూపాయల వాటాను ఇప్పించడమే ఆయన పాలిటి శాపంగా మారినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications