వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ పై కేశవరావు మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Keshav Rao
న్యూఢిల్లీ: రోశయ్య ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్న సమయంలో రాష్ట్ర గవర్నర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని కాంగ్రెసు సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. ఇది గవర్నర్‌ తన పరిధిని దాటడమేనన్నారు. ప్రభుత్వం బాధ్యతారహితంగా పనిచేస్తోందని, ప్రభుత్వ యంత్రాంగం ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదని గవర్నర్‌ అన్నట్లు మీడియాలో వార్తలు చూశానని, అవి నిజమైతే ఆయన అలా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒకవేళ ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ సరిగా పనిచేయకపోతే గవర్నర్‌ ఆ విషయాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపవచ్చు తప్ప ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఆయన పనికాదని అన్నారు. ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తానని చెప్పాలి తప్ప, గవర్నర్‌ తానే ప్రత్యక్ష హామీలు ఇవ్వడానికి వీలులేదని ఆయన అభిప్రాయపడ్డారు.

పరిపాలనా వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉంటే గవర్నర్‌ నరసింహన్‌ నేరుగా ముఖ్యమంత్రి రోశయ్యకి చెప్పాలని, కానీ పాలనపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని వ్యాఖ్యానించడం సరికాదని మరో కాంగ్రెసు సీనియర్‌ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. పాలనపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని గవర్నర్‌ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దీనివల్ల ఉద్యోగుల్లో ఆత్మస్త్థెర్యం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఇలాంటివి సరిదిద్దుకోవాలని కోరారు. పాలనా వ్యవస్థపై ఆయన ప్రత్యక్షంగా సీఎంకి సలహాలు ఇవ్వాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X