ముంబై: బంగారం ధర బులియన్ మార్కెట్లో శుక్రవారం చుక్కలంటింది. అంతర్జాతీయ మార్కెట్లో 495 రూపాయలతో ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుని పది గ్రాముల బంగారం ధర 18 వేల రూపాయలు పెరిగింది. హైదరాబాదు బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 18,100 రూపాయలు పలికింది. వారం రోజుల్లో బంగారం 400 రూపాయలకు పైగా పెరిగింది. శుక్రవారం 700 రూపాయలు పెరిగింది.
విజయవాడలో కూడా పది గ్రాముల బంగారం ధర 18,100 రూపాయలు పలికింది. విశాఖపట్నంలో 18,700 ధర పలికింది. చెన్నైలో పది గ్రాముల బంగారం ధర 17,940 రూపాయలు పలికింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 28,500 రూపాయలు పలికింది.