రోశయ్యది రద్దుల ప్రభుత్వం: బాబు

రైతులను కాంగ్రెసు ప్రభుత్వం నిలువునా ముంచుతోందని ఆయన విమర్శించారు. రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ఆరేళ్ల పాలనలో కాంగ్రెసు నేతలు అవినీతి, అక్రమాలతో బాగుపడ్డారని, ప్రజలు చితికిపోయారని ఆయన అన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్నంత అవినీతి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు కుక్కలు చింపిన విస్తరిలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications