తెరాసకు మంచిది కాదు: చంద్రబాబు

Chandrababu Naidu
నల్లగొండ: ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమను అడ్డుకోవడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మంచిది కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు సమస్యలను పరిశీలించేందుకు నల్లగొండ జిల్లా మిర్యాలగుడాకు వచ్చిన చంద్రబాబును అడ్డుకునేందుకు తెలంగాణవాదులు గురువారం ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు. తెలంగాణవాదులను అరెస్టు చేశారు. తెరాస తీరుపై చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో తెరాస కన్నా తమ పార్టీయే పెద్దదని ఆయన అన్నారు. తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణవాదులను తిప్పికొట్టాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీ నాయకులు పని చేస్తున్నారని ఆయన చెప్పుకున్నారు.

మార్కెట్ యార్డులోని ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రోశయ్యది పనికి మాలిన ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రులకు అవినీతిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+