హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడ దుర్గా ఎంటర్ ప్రైజెస్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులు సజీవదహనమయ్యారు. కార్మికులు స్వామి, రాజు, నరసింహ అనే కార్మికులు మంటల్లో మృతిచెందగా మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కంపెనీ యాజమాన్యంపై కఠినచర్యలు తీసుకుంటామని ఆల్వాల్ డీసీపీ శివప్రసాద్ తెలిపారు. రసాయనాలు ఉన్నందువల్లనే మంటలు త్వరగా అదుపులోకి రాలేదని అగ్నిమాపక అధికార్లు తెలిపారు.