విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద 9వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వేగంగా వస్తున్న లారీ, కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా గుడివాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.