'తెలంగాణ ప్రజలారా! సినిమాలు చూడకండి'

ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని, తెలంగాణ కళాకారులకు సినిమాల్లో అవకాశాలు రాకుండా అణగదొక్కుతున్నారని విమర్శించారు. ఈ వివక్షత పోయే వరకు తెలంగాణ ప్రజలు సినిమాలు చూడవద్దని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల జీవితం కథా వస్తువు సినిమాల్లో కనిపించడంలేదని, యాస, భాషను మాత్రం కించపరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ధూంధాం కళాకారుడు రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో దోపిడీ కొనసాగుతుందని, అసలైన తెలంగాణ కళాకారులకు స్థానం లేదన్నారు.
నటుడు కాంతారావు తెలంగాణ కు చెందిన వారు కావడం వల్లే ఆయన గురించి సినీ ప్రముఖులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.వి.ఎల్.నర్సింహారావు మాట్లాడుతూ తెలంగాణ సినిమాను ఆవిష్కరించుకున్నప్పుడే దోపిడీ అణిచివేత, వివక్షత అంతమవుతుందన్నారు. తెలంగాణ చిత్ర పరిశ్రమ జేఏసీ కన్వీనర్ జి.హన్మంతరావు మాట్లాడుతూ చిన్న నిర్మాతలను అణిచివేస్తున్నారని, అశ్లీలతతో కూడిన సినిమాలు చిన్నారుల హృదయాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications