కాబూల్: అఫ్గానిస్తాన్ లో సోమవారం విమానం కూలి 40 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. విమానంలో 38 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. వారంతా మరణించారా, ఎవరైనా బతికి ఉన్నారా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. స్థానిక పామిర్ ఏర్ వేస్ కు చెందిన విమానం కుందూస్ నుంచి కాబూల్ వస్తుండగా ప్రమాదం సంభవించింది.
విమానం అదృశ్యమైనట్లు అఫ్గానిస్తాన్ లోని కుందూస్ ప్రొవిన్స్ గవర్నర్ మొహమ్మద్ ఒమర్ సోమవారం ఉదయం చెప్పారు. విమానంలో విదేశీయులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. అయితే ఆ విమానం కూలిపోయినట్లు సమాచారం అందుతోంది. వివరాలు అందాల్సి ఉంది.