జగన్ ది సమైక్య యాత్ర కాదు: సురేఖ

తెలంగాణపై జగన్ నిలదీయాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావునూ నిలదీయాలని ఆమె అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని ఆమె అన్నారు. ఈ విషయాన్ని జగన్ కు చెప్తారా అని అడిగితే ఆయనకు తెలుసునని, తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. జగన్ యాత్రను అడ్డుకుంటామని ప్రకటించిన తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. దయాకర్ రావు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications