హరికృష్ణ లేఖతో తెలంగాణ నేతల తంటా

హరికృష్ణ ప్రకటనపై ఎర్రబెల్లి దయాకర రావు ప్రతిస్పందించారు. తెలంగాణ పరిస్థితులను హరికృష్ణకు వివరిస్తామని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. వ్యవహారంపై హరికృష్ణతో మాట్లాడుతామని ఆయన అన్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలనే తమ నిర్ణయంలో మార్పు లేదని ఆయన ప్రకటించారు. హరికృష్ణ లేఖపై పార్టీ మరో తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి కూడా ప్రతిస్పందించారు. ఆ విషయం హరికృష్ణతోనే మాట్లాడుతామని ఆయన చెప్పారు. అయితే హరికృష్ణ వైఖరి తెలుగుదేశం తెలంగాణ నేతలకు రుచించడం లేదు. కానీ, ఏమీ చేయలేని స్థితి కూడా ఉంది. హరికృష్ణ స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బావమరిది కావడం వారి ఇబ్బందికి కారణం. మిగతా సీమాంధ్ర నేతల ప్రకటనలపై ప్రతిస్పందించిన రీతిలో హరికృష్ణ ప్రకటనపై స్పందించే సాహసం తెలంగాణ నేతలకు లేదు.












Click it and Unblock the Notifications