హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తెలంగాణ యాత్ర ఉంటుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణ ఓదార్పు యాత్రపై తీవ్ర సందిగ్దత నెలకొని ఉంది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతికి కలత చెంది మరణించినవారి కుటుంబాలను పరామర్శించడానికి ఆయన ఈ నెల 28వ తేదీ నుంచి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన పర్యటనకు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) నుంచే కాకుండా సొంత పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. జగన్ యాత్రను అనుమతించవద్దని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య అధిష్టానానికి లేఖలు రాశారు. పైగా, నిఘా విభాగం సమాచారం కూడా జగన్ యాత్రకు అనుకూలంగా లేవు.

జగన్ వరంగల్ జిల్లా పర్యటన వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చునని నిఘా విభాగం అంచనా వేస్తోంది. ఈ మేరకు నిఘా విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ మంగళవారం జెఎసి నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది. తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా జగన్ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జగన్ యాత్రకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళీధర రావు మాత్రం జగన్ ఓదార్పు యాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ స్థితిలో జగన్ ఓదార్పు యాత్ర జరుగుతుందా, లేదా అనేది సందేహంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X