వైయస్ జగన్ తెలంగాణ యాత్ర: రోశయ్య, సబితల మధ్య విభేదాలు

కాగా, యాత్రను వాయిదా వేసుకోవాలని నచ్చజెప్పేందుకు జగన్ వద్దకు వెళ్లాలని గురువారం మంత్రివర్గ సమావేశంలో రోశయ్య సబితా ఇంద్రారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే తాను ఒక్కతే వెళ్లడానికి ఆమె ఇష్టపడలేదని చెబుతున్నారు. దాంతో సబితా ఇంద్రారెడ్డి వెంట వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి జగన్ నివాసానికి వెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారి మాటను జగన్ వినలేదు. జగన్ యాత్ర వల్ల సంభవించే పరిణామాలకు మంత్రులదే బాధ్యత అంటూ ముఖ్యమంత్రి రోశయ్య అప్పటికే చెప్పేశారు. అలా చెప్పేసి ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications