వైయస్ జగన్ ను అడ్డుకుని తీరుతాం: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరంగల్ ఓదార్పు యాత్రను అడ్డుకుని తీరుతామని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు. జగన్ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులకు జగన్ కారణమవుతున్నాడని ఆయన విమర్శించారు. జగన్ తన వరంగల్ ఓదార్పు యాత్రను రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వైయస్ జగన్ యాత్రపై తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. తెలంగాణలోని పరిస్థితిని దృష్టిలో ఉంచుకోకుండా జగన్ యాత్ర సాగించడం సరైంది కాదని ఆమె అన్నారు. కాంగ్రెసు అధిష్టానం కూడా సీమాంధ్ర నేతలకు అనుకూలంగా వ్యవహిరిస్తోందని ఆమె విమర్శించారు. తన మాటను ధిక్కరిస్తే తెలంగాణ నాయకులపై చర్యలు తీసుకుంటున్న కాంగ్రెసు అధిష్టానం సీమాంధ్ర నేతలపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. అధిష్టానం వారించినా జగన్ వరంగల్ జిల్లా పర్యటనకు పూనుకున్నారని, అయినా ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+