పథకం ప్రకారమే నన్ను అరెస్టు చేశారు: వైయస్ జగన్

YS Jagan
నల్లగొండ: పథకం ప్రకారమే తనను అరెస్టు చేశారని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తనను మూడు గంటల పాటు ట్రైన్ అరెస్టు చేశారని ఆయన అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వంద తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు చేసిన పనికి ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు. తెరాస కార్యకర్తలు వంద మంది తమ పార్టీ శాసనసభ్యులపై దాడి చేశారని, ప్రాణహాని తలపెట్టారని, వారికి ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన అన్నారు. తిరిగి తన కార్యక్రమం ఉంటుందని, వరంగల్ జిల్లాలోని 77 మందిని తాను తప్పకుండా పరామర్శిస్తానని ఆయన అన్నారు.

తాను పరామర్సించడానికి వస్తే తెరాస ఎందుకు భయపడుతోందని ఆయన అడిగారు. ఇప్పటికైనా తెరాస కళ్లు తెరవాలని ఆయన అన్నారు. తాను రానేమోననే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న యాదగిరికి, ఎల్లయ్యకు తాను సమాధానం చెప్పాల్సి ఉంటుందని, తన కన్నా ఎక్కువగా తెరాస సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెరాస ప్రజలను భయపెడుతోందని ఆయన విమర్శించారు. స్థానికేతరులైన హరీష్ రావు, ఈటెల రాజేందర్, కోదండరామ్ మహబూబాబాద్ ఎందుకు వచ్చారని ఆయన అడిగారు. వారు వచ్చి ప్రజలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. వారు క్షుద్రరాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను మంచి కార్యక్రమం చేపడితే తెరాస రాజకీయం చేసి చేసిందని, బయటి నుంచి జనాలను రప్పించారని ఆయన అన్నారు. తెరాస ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+