వైయస్ జగన్ పై తెలంగాణ కాంగ్రెసు ఎంపీల ఎదురుదాడి

ముఖ్యమంత్రి కె. రోశయ్యను జగన్ విమర్శించడం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అవమానించడమేనని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వాన్ని మనమే విమర్శించడం పద్ధతి కాదని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అందరూ పాటించాలని ఆయన అన్నారు. తెలంగాణలో ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలని మాత్రమే తాము జగన్ కు సూచించామని, రద్దు చేసుకోవాలని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలని, సహనం అవసరమని, అప్పుడే భవిష్యత్తు ఉంటుందని ఆయన జగన్ కు పరోక్ష సూచన చేశారు.
శాంతిభద్రతల గురించి ఆలోచించడం తన తప్పా అని రోశయ్య ఎంపిలతో అన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిని కలిసిన తెలంగాణ కాంగ్రెసు ఎంపీల్లో యాష్కీ, సుఖేందర్ రెడ్డిలతో పాటు సర్వే సత్యనారాయణ, వివేక తదితరులు ఉన్నారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపిలు సోమవారం రాత్రి సమావేశమై రోశయ్యకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications