కెవిపి రామచందర్ రావుపై వైయస్ జగన్ కోపం

కెవిపి రామచందర్ రావు ముఖ్యమంత్రి కె. రోశయ్యకు సహకరిస్తున్నారని, దాని వల్ల రోశయ్య నిలదొక్కుకోకుండా ఎప్పటికప్పుడు ఆటంకాలు కల్పిస్తున్న వ్యూహాలు దెబ్బ తింటున్నాయని ఆయన భావిస్తున్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తన వర్గానికి చెందిన పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సహకరించడంలో కెవిపి పాత్ర ప్రధానంగా ఉందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో జగన్ కెవిపిని దూరంగా పెట్టి తన వ్యూహరచనను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మార్గంలో పయనించాలనేది జగన్ వ్యూహమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications