వైయస్ జగన్ మాత్రమే రాష్ట్ర కాంగ్రెసు రక్షకుడా?

అంతేకాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెసు నాయకులు పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో కుమ్మక్కయ్యారనే విషయాన్ని అర్థం చేయించడానికి ఆయన పదే పదే ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ తో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, ఇతర నాయకులు కుమ్మక్కు కావడం వల్ల తెలంగాణలో కూడా పార్టీని నిలబెట్టేది తానే అని ప్రదర్శించుకోవడానికి చూస్తున్నారని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా రోశయ్య అసమర్థుడని చిత్రీకరించడానికి ఆయన మొదటి నుంచీ ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ సంఘటనపై రోశయ్య మీద విమర్శలు చేయడం అందులో భాగమేనని భావిస్తున్నారు. కెసిఆర్ ప్రాబల్యాన్ని, వ్యూహాలను తాను తిప్పికొట్టాలని చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేశారని చెప్పడానికి ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ ను కాంగ్రెసుకు ప్రధాన శత్రువుగా చూపించే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారని అంటున్నారు. ఈ స్థితిలో తాను మాత్రమే రాష్ట్రాన్ని నడిపి కాంగ్రెసును తిరిగి అధికారంలోకి తీసుకురాగలనని అధిష్టానం చేత అనిపించాలనేది జగన్ తాపత్రయంగా కనిపిస్తోంది.
తన అంతరంగ విషయాలను అధిష్టానం సరిగా అర్థం చేసుకోవడం లేదని ఆయన మథపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లి నేరుగా సోనియా గాంధీతోనే సమావేశం కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన ఆయనను శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి బుధవారం ఉదయం కలుసుకున్నారు. అలాగే, శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి కూడా ఆయనతో భేటీ అయ్యారు. వీరందరి వద్ద జగన్ తన గోడును వెల్లబోసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications