మహానంది: బాలమాత శాంబవి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. సూర్యనందిలోని చిన్నారి శాంభవి నివసిస్తున్న కుటీరాన్ని శనివారం గుర్తుతెలియని వ్యక్తు లు ధ్వంసం చేశారు. పై కప్పును తొలగించిన దుండగులు సామగ్రిని చిందరవందర చేశారు. కుటీరంలోని వస్తువులతోపాటు శాంభవి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన హోమం వద్ద ఉన్న పెద్ద బండరాయిని పగులగొట్టారు.
శాంబవి, అమె తల్లి ఉషారాణి ప్రస్తుతం ధర్మశాల లో ఉన్నారు. ఈ సమాచారాన్ని వారికి అందించడానికి స్థానికులు, సన్నిహితులు ప్రయత్నిస్తున్నారు.