వైయస్ జగన్ బహిరంగ లేఖపై సోనియా గాంధీ ఆగ్రహం

ఓదార్పు యాత్రకు గడువు విధించడం కూడా కాంగ్రెసు అధిష్టానానికి రుచించడం లేదు. ఇతర పార్టీలు గడువులు పెడితేనే చిరాకు పడే కాంగ్రెసు అధిష్టానం సొంత పార్టీ నాయకుడు గడువు విధించడం హెచ్చరికలాంటిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జులై 1వ తేదీ లోగా సోనియా అపాయింట్ మెంటు ఇవ్వకపోతే శ్రీకాకుళం ఓదార్పు యాత్రను అధిష్టానాన్ని ధిక్కరించైనా సరే ముందుకు సాగాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు భావిస్తున్నారు. తేల్చుకోవాల్సింది అధిష్టానమేననే విధానంలో జగన్ వ్యవహరించడం అధిష్టానం వ్యతిరేకతకు మరో కారణంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications