ఇవియంలపై పార్టీలకు నమ్మకం కలిగిస్తాం: ఐవి సుబ్బారావు
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: రాజకీయ పార్టీ భాగస్వామ్యంతోనే ఈవీఎంలపై పూర్తి నమ్మకం కలిగించేందుకు అందరూ కృషి చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని పది శాసనసభా నియోజకవర్గాలకు జులై 2న ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి ఫలితాలు వెలువడేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిటర్నింగ్ అధికారులు, ఏఆర్వోలు, డీఆర్వోలకు జూబ్లీహాలులో శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఉప ఎన్నికల్లో ఎదురయ్యే సవాళ్లను సమష్టిగా అధిగమిద్దామని ఆయన సూచించారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకు ఈ ఉప ఎన్నికల నిర్వహణ సదవకాశంగా తీసుకోవాలని ఆయన అన్నారు.