కె చంద్రశేఖర రావు దీక్ష దీక్షనే కాదు, సత్తా మాదే: పాల్వాయి

Palwai Govardhan Reddy
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దీక్ష దీక్షనే కాదని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీక్షకు భయపడి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ ప్రకటన చేయలేదని, తాము మేనేజ్ చేసి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసేలా చూశామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ తో ఫిక్సింగ్ కు పాల్పడడమంత తెలివి తక్కువ పని మరోటి ఉండదని, కాంగ్రెసుకు కెసిఆర్ తో ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

విలువ లేని మాటలతో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఐదేళ్లు వెనక్కి తీసికెళ్లారని ఆయన అన్నారు. తెలంగాణలో పనికి మాలిన ప్రాజెక్టులను తలపెట్టారని, ఆంధ్రాలో ప్రయోజనకరమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలోని సాగు నీటి ప్రాజెక్టులను సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+