హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో భారత బంద్ షురూ: నిలిచిపోయిన బస్సులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ధరల పెరుగుదలకు నిరసనగా విపక్షాలు చేపట్టిన భారత్‌ బంద్‌ రాష్ట్రంలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. ధరల పెరుగుదలకు నిరసనగా విపక్షాలు చేపట్టిన భారత్‌ బంద్‌ కు మద్దతుగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లిలో ఆందోళనకారులు మూడు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బర్కత్‌ పురలోని ఆర్టీసీ డిపోకు విపక్షాలు తాళం వేశాయి. మెదక్‌ జిల్లాలోని కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ చౌరస్తా వద్ద పలు బస్సుల అద్దాలు పగలగొట్టారు. విజయవాడ పాతబస్టాండ్‌ ప్రాంతంలో విపక్షాలు ఆందోళన కారణంగా బస్సులు ఆగిపోయాయి. విశాఖపట్నం మద్దెలపాలెం ఆర్టీసీ డిపో వద్ద వామపక్షాల కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ధరల పెంపునకు నిరసనగా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భాజపా వంటావార్పు చేస్తోంది. తిరుపతిలోని పూర్ణకుంభ సర్కిల్‌లో విపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు.

భారత్‌ బంద్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల్లో బస్సులు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్ ‌లోని రాజేంద్రనగర్‌ డిపో ఎదుట బైఠాయించి భాజపా కార్యకర్తలు బస్సులను అడ్డుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో 7 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ బస్టాండ్‌ల వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సీపీఎం నాయకులు ఖమ్మం జిల్లాలోని డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్నారు. కడపలోనూ బంద్‌ కారణంగా మైదుకూరు డిపోలోనే బస్సులు నిలిచిపోయాయి. ఒంగోలులో హర్తాళ్‌ నిర్వహిస్తున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని రావూరు, ఆత్మకూరు, కావలిలో ఆర్టీసీ బస్సులు కదలడంలేదు. గుంటూరులోనూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బస్సులను అడ్డుకొని తెలుగుదేశం, వామపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.

ధరల పెరుగుదలకు నిరసనగా చేపడుతున్న భారత్‌ బంద్‌ నుంచి తిరుమల వెళ్లే బస్సులకు మినహాయింపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాలు ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తుండడంతో పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. నగర శివారులోని హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌కు బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. తిరుపతి నుంచి కర్నూలు వెళ్లాల్సిన బస్సులను కడపలో అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, మహబూబ్‌నగర్‌ సహా పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. అయితే నగరంలో పాక్షికంగా సిటీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X