వైయస్ జగన్ యాత్రకు మరో హెచ్చరిక: రోశయ్య ప్లాన్

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారశైలిపై కాంగ్రెసు అధిష్టానం తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. ఆయన తీరును అధిష్టానం సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అధిష్టానం మరోసారి జగన్ కు హెచ్చరికలాంటి సూచన చేసింది. జగన్ ఓదార్పు యాత్ర చేపట్టకపోవడమే మంచిదని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఎవరైనా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎవరు కూడా పార్టీకి, అధిష్టానానికి అతీతులు కారని ఎఐసిసి మరో అధికార ప్రతినిధి మనీష్ తివారీ మంగళవారం ఉదయం అన్నారు. ఎవరైనా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి లేదని, ఈ విషయంలో అధిష్టానం వైఖరి మారదని అభిషేక్ సింఘ్వీ సోమవారం సాయంత్రం కూడా చెప్పారు. దీన్ని బట్టి అధిష్టానం జగన్ వ్యవహారాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంటుందో అర్థమవుతోంది.

కాగా, ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా జగన్ ఓదార్పు యాత్రకు చెక్ పెట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆయన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రేపు బుధవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే శాసనసభా సమావేశాలు ఉన్నందున తాను రాలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి తొలుత తెలిపారు. ఓదార్పు యాత్ర చేపట్టేందుకు జగన్ సిద్ధం కావడంతో ఆయన మనసు మార్చుకున్నారు. బుధవారం శాసనసభా సమావేశాలు ముగిసిన వెంటవే హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. సమావేశం మిషతో జగన్ కు చెక్ పెట్టేందుకే మనసు మార్చుకుని ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+