హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి సంజాయిషీ పంపించారు. గత నెల 28న జరిగిన ఓ సమావేశంలో డీఎస్ కులం పేరుతో ఓట్లు అడిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ అర్బన్ నుంచి డిఎస్ గత ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆయనను బిజెపి అభ్యర్ధి ఓడించడం విశేషం. ఇప్పుడు శీనివాస్ అదే నియోజకవర్గం నుంచి రంగంలో ఉన్నారు.